UPDATES  

NEWS

 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలపై సీఎం రేవంత్ సెటైర్లు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలను అడవి పందులను బెదరగొట్టడానికే ఉపయోగపడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన మహిళా శక్తి కార్యక్రమంలో మాట్లాడిన రేవంచ్.. గత పాలనలో నాణ్యతలేని చీరలను పంపిణీ చేసినట్లు ఆయన ఆరోపించారు. ఆ క్వాలిటీ లేని చీరలను ఆడబిడ్డలు.. చేల గట్ల వద్ద పక్షులను, అడవి పందులను బెదరకొట్టడానికి వాడారని సెటైర్లు వేశారు. తమ ప్రభుత్వం అందించిన చిలుకపచ్చ రంగు చీరను మంత్రి సీతక్కతో పాటు ఆడబిడ్డలంతా సంతోషంగా కట్టుకుని సభకు రావడం చూస్తే గర్వంగా ఉందన్నారు.

 

తెలంగాణ ఆర్థిక ప్రగతి అంతా ఆడబిడ్డల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో రూ. 61,000 కోట్ల బ్యాంక్ లింకేజ్ అందించామని వెల్లడించారు. సున్నా వడ్డీ పథకం కింద బ్యాంకులకు రూ. 2,000 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మరోమారు రేవంత్ రెడ్డి పునురుద్ఘటించారు.

 

‘గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు అడవి పందులను బెదరగొట్టడానికే వాడారు’

 

గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట ఇచ్చిన నాణ్యత లేని చీరలను ఆడబిడ్డలు చేల గట్ల వద్ద పక్షులను, అడవి పందులను బెదరగొట్టడానికి వాడారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అందించిన చిలుకపచ్చ రంగు చీరను…

మరోవైపు రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ పేరుతో మహిళా సంఘాలకే అప్పగించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఈ పనులను కాంట్రాక్టర్లకు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం ఆడబిడ్డలకే ఆ సర్వహక్కులు కల్పించిందన్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థినుల డ్రాపౌట్స్ తగ్గి, విద్యాశాతం గణనీయంగా పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఒక ఆడపిల్ల చదివితే కుటుంబమే బాగుపడుతుందని సీఎం స్పష్టం చేశారు.

 

ఇదిలా ఉంటే మహిళా శక్తి సభకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో వచ్చారు. రేవంత్ తో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క కూడా ప్రయాణించారు. సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. ఈ క్రమంలో వర్షంలోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్న రేవంత్.. వానలో తడుస్తూ వేదిక వద్దకు వచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పూర్తిగా వర్షంలో తడవడం గమనార్హం

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |