UPDATES  

NEWS

 ఏపీలో స్మార్ట్ సిటీలు.. రష్యాలో మంత్రి లోకేష్ కీలక భేటీ..

ఆంధ్రప్రదేశ్‌లో సేఫ్ అండ్ స్మార్ట్ సిటీల నిర్వహణ కోసం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రష్యాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్.. సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ప్రభుత్వ రీజనల్ ఫారిన్ ఎఫైర్స్ విభాగం చీఫ్ ఎక్స్‌పర్ట్ పోలినా పోలుఖినాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఒక ఉమ్మడి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్ స్వయంగా వెల్లడించారు.

 

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు లోకేష్ వివరించారు. ప్రధానంగా సేఫ్ & స్మార్ట్ సిటీల నిర్మాణం కోసం పౌరులతో చర్చలు జరపడం, డేటా ఆధారిత నగర నిర్వహణ, డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, నగరాల్లో విశ్వసనీయమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ఇరుపక్షాలు చర్చించాయి.

 

ఏపీలో స్మార్ట్ సిటీల అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం, అనుభవాన్ని పంచుకునేందుకు ఈ ఉమ్మడి వర్కింగ్ గ్రూప్ దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ సహకారంతో రాష్ట్రంలోని నగరాలను మరింత సురక్షితంగా, ఆధునికంగా తీర్చిదిద్దేందుకు మార్గం సుగమం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |