UPDATES  

NEWS

 వేములవాడలో రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్..!

వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా టూరిజం హబ్ గా మార్చడమే లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ లో మూడవ బ్రిడ్జి స్లాబ్ పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

 

ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..

 

వారు మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయ సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో , జిల్లా మంత్రుల సహకారంతో , జిల్లా అధికారుల సమన్వయంతో రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం అన్నారు.

ఇప్పటికే 150 కోట్లు విడుదల చేసుకొని రాజన్న ఆలయ అభివృద్ధి పనులను శిరవేయంగా కొనసాగుతున్నాయని అన్నారు.. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శిలాఫలకలకే పరిమితమై వారిచ్చిన వాగ్దానాలన్నీ నీటి మూటలు అయ్యాయని అన్నారు.. 2015 లో మూడో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు చేయడం మరిచిపోయారని ఎద్దేవ చేశారు.. కనీసం భూసేకరణ చేయకుండా వారు కేవలం వారు ప్రజలను మభ్య పెట్టారని అన్నారు.

 

బ్రిడ్జి భూసేకరణకు ₹6.97 కోట్లు మంజూరు

 

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడో బ్రిడ్జి భూసేకరణ కోసం 6 కోట్ల 97 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.. గత ప్రభుత్వం హయంలో వారు కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రమే శిలాఫలకాలు వేశారని అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కాదన్నారు. దానికి సజీవ సాక్షాలుగా తిప్పాపూర్ మూడవ బ్రిడ్జి కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులకు భూసేకరణ చేయకుండా కేవలం శిలాఫలకాలే వేశారని తెలిపారు.. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజా ప్రభుత్వంలో భూసేకరణకు నిధులు విడుదల చేసి భూ సేకరణ చేయడం జరిగిందన్నారు… ఇప్పటికి ప్రాజెక్టు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి అన్నారు..

 

రూ. 1000 కోట్లతో అభివృద్ధి పనులు

 

రాజన్న ఆలయం ముందు నుంచి తిప్పాపూర్ బ్రిడ్జి వరకు 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయని త్వరలోనే లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు..బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణాలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |