UPDATES  

NEWS

 చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. రేవంత్ ప్రభుత్వానికి సవాల్..

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై వస్తున్న చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ ఆరోపణలు నిరూపిస్తే సదరు ఆస్తిని తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్ విసిరారు. మంగళవారం హైదరాబాదులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

“మేము ఒక చెరువుని కబ్జా చేశామంట, నాకేం పనిలేదా? నిజంగా మీరు అన్నట్టుగా కబ్జా చేస్తే నా ఇల్లు తగలబెట్టేసేవారు” అంటూ పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే చెబుతున్నానని పేర్కొన్నారు. ఆయనంటే తనకు ఇష్టం, గౌరవం ఉన్నాయని అన్నారు.

 

“పవన్ కల్యాణ్ ఒక చెరువును ఆక్రమించుకున్నాడని మీరు నిరూపిస్తే, ఈరోజు నేను సంతోషంగా తెలంగాణ ప్రభుత్వానికి ఆ చెరువును రాసి ఇచ్చేస్తున్నాను” అని ఆయన అన్నారు. గతంలో కూడా తనను ఇబ్బంది పెట్టేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని పవన్ అన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |