UPDATES  

NEWS

 పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు..!

ఏపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

 

ఆమె పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను ఆయనను ప్రేమగా ‘పీపీపీ’ (PPP-పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్) గారు అని పిలుచుకుంటాను అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ఎన్నికల ముందు ఎక్కడైనా అన్యాయం జరిగితే ‘తలలు తీసేసే చట్టాలను తీసుకొస్తా’ అంటూ పవన్ పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నా ఆయన మాత్రం ‘ఉలకడు, పలకడు’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.

 

ఇంతకంటే దారుణమైన దుస్థితి మరొకటి ఉండదన్న శ్యామల.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, పక్క రాష్ట్రంలో మహిళలు ఆయన ఫోటోలను చెప్పులతో కొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంతలా దిగజారిపోయిందని, మహిళల రక్షణ విషయంలో వైఫల్యం చెందిందని ఆమె విమర్శించారు. శ్యామల చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |