UPDATES  

NEWS

 పవన్ కల్యాణ్ గారు.. సీబీఐ విచారణకు ఆదేశించండి: అంబటి రాంబాబు..

23 ఏళ్ల యువకుడు గాదె సాయికృష్ణను లాకప్‌ డెత్ చేశారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. “సాయికృష్ణను పోలీసులు హత్య చేసి శవాన్ని మాయం చేశారు. దేశంలో ఇంత ఘోరమైన లాకప్ డెత్ ఎక్కడా జరగలేదు” అని ఆరోపించారు. “సాయికృష్ణ మేనమామ నవరంగ్ నా దగ్గరకు వచ్చి జనసేన కార్యకర్తనని చెప్పారు. సాయికృష్ణ తల్లి వేదన ఎవరినైనా కలచివేస్తుంది. పార్టీలకు అతీతంగా ఈ అంశంపై ఉద్యమం చేయాలి” అని పిలుపునిచ్చారు. ఈ అంశంపై సీబీఐ ఎంక్వైరీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. “పవన్ కల్యాణ్‌కు చేతులు జోడించి వేడుకుంటున్నాను. సీబీఐ విచారణకు ఆదేశించండి. మనం మానవులం కదా” అని అన్నారు.

 

సాయికృష్ణ మేనమామ నవరంగ్ మీడియాతో మాట్లాడుతూ… “ఈ విషయాన్ని పార్టీలకు ముడిపెట్టడం సరికాదు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే దాడి చేసి చంపి దహనం చేయడమా? ఆ తల్లి బాధ ఎవరికీ రాకూడదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |