UPDATES  

NEWS

 ఈసీకి సంచలన లేఖ రాసిన వైసీపీ పార్టీ..! కూటమి సర్కార్ షాక్..!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ సర్టిఫికెట్ల జారీపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో కుల ధ్రువీకరణ, నో డ్యూస్‌/ఎన్‌ఓసీ సర్టిఫికెట్ల జారీలో జాప్యంపై ఈసీకి లేఖ వైసీపీ పార్టీ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ సమస్య పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వైఎస్సార్‌సీపీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.

అయితే సాంకేతిక సమస్యల పేరుతో అభ్యర్థులను తిప్పి పంపుతున్నారని ఫిర్యాదు వైసీపీ తెలిపింది. సర్టిఫికెట్ల జారీలో జాప్యంపై GSWS ఉన్నతాధికారుల పాత్రపై నిష్పక్షపాత విచారణ చేయాలని వైఎస్సార్‌సీపీ కోరింది. GSWS కార్యదర్శి భాస్కర్ కాటంనేని, డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్‌లపై విచారణ జరపాలని వైసీపీ పార్టీ డిమాండ్ చేసింది. సర్వర్ సమస్యపై అధికారుల నుంచి వివరణ కోరాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.

పెండింగ్‌లో ఉన్న అర్హులైన అభ్యర్థుల సర్టిఫికెట్లను వెంటనే జారీ చేయాలని ఈసీకి లేళ్ల అప్పిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సాంకేతిక సమస్యలను సాకుగా చూపి అభ్యర్థుల నామినేషన్ అవకాశాలను దెబ్బతీయొద్దని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. దీంతో అక్టోబర్ 1న ఇచ్చిన ఫిర్యాదు తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని ఈసీకి లేళ్ల అప్పిరెడ్డి లేఖలో పేర్కోన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |