UPDATES  

NEWS

 Nirmal: మాదకద్రవ్యాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు, అక్రమ గుట్కా రవాణా, విక్రయాల నిర్మూలనపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ, అటవీ, విద్య, వ్యవసాయ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలు తమ పరిధిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల సాగు, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగాన్ని ఏ రూపంలోనూ ఉపేక్షించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |