UPDATES  

NEWS

 Dagadarthi Airport: దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి 2016లోనే సూత్రప్రాయ ఆమోదం.. కేంద్రం కీలక ప్రకటన

నెల్లూరు జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదించిన దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుపై రాజ్యసభలో ఎంపీ బీద మస్తాన్ రావు యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ సమాధానం ఇచ్చారు. విమానాశ్రయ అభివృద్ధికి సంబంధించిన గత పరిణామాలను కేంద్ర మంత్రి సభకు వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2016లో దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి సూత్రప్రాయ (In-Principle) ఆమోదం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు తొలుత 2016లో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు.

అనంతరం 2018లో ఎంపికైన సంస్థతో కన్సెషన్ ఒప్పందం కుదిరిందని, అయితే ఆ సంస్థ నిర్ణీత సమయంలో Financial Closure సాధించలేకపోవడంతో ఆ ఒప్పందాన్ని 2020లో రద్దు చేసినట్లు మురళీధర్ మొహోల్ తెలిపారు. దీంతో దగదర్తి విమానాశ్రయ ప్రాజెక్టుపై తదుపరి చర్యలు, అభివృద్ధి ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |