UPDATES  

NEWS

 తెలిసో తెలియకో యాక్సిడెంట్ చేశాడు.. దీన్ని కుట్ర అంటున్నారు: జగన్..

యాక్సిడెంట్ ఎవరూ కావాలని చేయరు. యాక్సిడెంట్ హత్య ఎలా అవుతుంది? గొర్రెల కాపరి ఎవరో కూడా వీరికి తెలియదు. దురదృష్టవశాత్తు జరిగిన యాక్సిడెంట్ అది. చిన్నపిల్లాడు చేసిన యాక్సిడెంట్ కు హత్య, కుట్ర కోణం ఆపాదించారని ఏపీ మాజీ సీఎం జగన్ అన్నారు.

 

కుట్రతో కేసులు పెడతారా?

బైక్ యాక్సిడెంట్ జరిగితే కుట్ర కోణం ఎక్కడుంది? అప్పలరాజు టెన్త్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్.. చంద్రబాబు అప్పట్లో అభినందించారు కూడా సీదిరి అప్పలరాజు సామాన్య కుటుంబం నుంచి వచ్చి మంత్రిగా ఎదిగారు. సీదిరిపై తప్పుడు కేసును బనాయించారు. టీడీపీకి చెందినవారు కూడా యాక్సిడెంట్ చేస్తే వారిపైనా ఇలాగే కుట్ర కేసులు పెడతారా? అంటూ జగన్ ఫైర్ అయ్యారు.

 

108కు ఫోన్..

అప్పలరాజు కుమారుడి భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారు. చెడు విత్తనాలు నాటుతున్నారు. ఇవి వృక్షాలై వ్యవస్థను నాశనం చేస్తాయి. యాక్సిడెంట్ జరిగిన వెంటనే 108కు ఫోన్ చేసి, సీపీఆర్ కూడా చేశాడు. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలకు అప్పలరాజు అరెస్ట్ ఒక ఉదాహరణ అని వైఎస్ జగన్ అన్నారు.

 

తెలిసో తెలియకో..

సీదిరి అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల పిల్లోడు, మొన్ననే నీట్ రాశాడు. తెలిసో తెలియకో పొరపాటున యాక్సిడెంట్ చేస్తే దానికి కుట్ర కోణం అంటగట్టారు. అప్పలరాజు కుటుంబాన్ని వేధించడం ఎంతవరకు సమంజసం కాదని వైఏస్ఆర్‌సీపీ జగన్ అన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |