UPDATES  

NEWS

 గాదె సాయికృష్ణ కేసులో సంచలనం.. తల్లికి తెలియకుండానే విత్‌డ్రా పిటిషన్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఉపసంహరణపై హై కోర్టులో విచారణ చేపట్టింది. భాదిత పిటిషనర్‌కు తెలియకుండా విత్ డ్రా పిటిషన్ ఫైల్ చేసినట్టు అడ్వకేట్ అంగీకరించారు. ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నట్టు కోర్టుకు తీసుకెల్లారని అడ్వకేట్ తెలిపారు.

 

కేసు విత్ డ్రా..

పిటిషనర్ విజయలక్ష్మి యోక్క ప్రమేయం లేకుండా అనుబంధ పిటిషన్లు వేసినట్టు ఆమే తరుపు అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. హెబియస్ కార్పస్ పిటిషన్ ఉపసంహరిస్తున్నట్టు సాయి కృష్ణ తల్లికి తెలియకుండా పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. కేసు విత్ డ్రా పిటిషన్ వ్యవహారంలో మరో న్యాయవాదితో భాదితుడు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కలిసి హై కోర్టును ఆశ్రయించింది.

 

కోర్టు సీరియస్..

ఆమెకు తెలియకుండానే NOC ఇవ్వకపోవడం, అనుబంధ పిటిషన్లు ఫైల్ చేయడం వంటి అంశాలపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి జోక్యం కోరారు. దీంతో తాజా పరిణామాలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం రెండున్నరకు కేసు విచారణ వాయిదా వేసి మధ్యాహ్నం తరువాత మరోసారి విచారణ జరపనున్నట్టు ఏపీ హై కోర్టు తెలిపింది. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో దాఖలైన పిటిషన్ల అంశంలో వరుస పరిణామాలపై ఏపీ హైకోర్టు సిరియస్ ఉంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |