UPDATES  

NEWS

 ఇచ్ఛాపురంలో భారీగా గంజాయి స్వాధీనం.. ఒడిశా ముఠా అరెస్ట్..!

శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి చిక్కింది. అక్రమంగా తరలిస్తున్న 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దీని వెనుక ఉన్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

 

ఒడిశా నుంచి సూరత్‌కు అక్రమ రవాణా

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన అనిల్ కుమార్ గౌడో, మునా ప్రధాన్ అనే ఇద్దరు వ్యక్తులు భారీ స్థాయిలో గంజాయిని ఒడిశా నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు తరలించేందుకు పథకం వేశారు. రైలు మార్గంలో వెళ్లేందుకు ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వీరి ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వారి బ్యాగులను పరిశీలించగా గుట్టుచప్పుడు కాకుండా దాచిన 34 కిలోల గంజాయి బయటపడింది.

 

రిమాండ్‌కు తరలింపు

 

పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 34 కిలోల గంజాయితో పాటు వారి వద్ద ఉన్న రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఇచ్చాపురం పోలీసులు, నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

 

నిఘా తీవ్రం.. హెచ్చరిక

 

సరిహద్దు ప్రాంతాల్లో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాపై నిఘాను మరింత కట్టుదిట్టం చేశామని పోలీసులు తెలిపారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, ఎవరినీ విడిచిపెట్టేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |