UPDATES  

NEWS

 స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు-పవన్ కీలక భేటీ..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేన అధినేత పవన్ కల్యాణ్. 100 శాతం గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో అగ్రనేతలిద్దరు మరోసారి సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 100 శాతం గెలవాలని ప్లాన్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో తొలిసారి అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అగ్రనేతల మధ్య భేటీ దాదాపు రెండుగంటలపాటు సాగింది. ఈ భేటీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జెడ్పీ ఛైర్మన్లు ఎవరికి ఎన్ని అన్నదానిపై కూలంకుషంగా చర్చించినట్టు ఓ ఫీలర్ బయటకువచ్చింది.

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జెడ్పీ ఛైర్మన్లకు డైరెక్ట్ ఎన్నిక కావడంతో వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఒకరు మేయర్ అయితే మరొకరు డిప్యూటీ మేయర్, అలాగే మున్సిపాలిటీలు, జెడ్పీ ఛైర్మన్లను ఆ విధంగా షేర్ చేసుకోవాలని ఓ ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. దీనికితోడు టీడీపీ-జనసేన మధ్య సమన్వయానికి జాయింట్ మెకానిజం కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ బాధ్యతలను జాయింట్ కమిటీ చూడనుంది. 100 శాతం గెలుపే లక్ష్యంగా పని చేయాలని, గతంలో ఎన్నిక ఏక పక్షంగా జరిగిందని, ఇప్పుడు ఫేర్‌గా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నట్లు తెలుస్తోంది.

బలమున్న చోట కూటమి భాగస్వామ్య పక్షాలు పోటీ చేసేలా సూత్రప్రాయ అంగీకారానికి వచ్చారట. సీట్ల సర్దుబాటులో స్థానిక ఎమ్మెల్యేల కంటే  కిందిస్థాయిలో పార్టీల బలాబలాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. కిందిస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు టీడీపీ-జనసేన సమన్వయం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. అందులో పార్టీలకు చెందిన మంత్రులు, కీలక నేతలు ఉండనున్నారు.

స్థానిక ఎన్నికల్లో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా కలిసి పని చేయాలని ఇరువురు నేతలు డిసైడ్ అయ్యారు. కూటమి ఐక్యత, సమన్వయంపై క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కమిటీ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరోసారి సమావేశం కావాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చినట్టు అమరావతి రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |