UPDATES  

NEWS

 బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ.. మమతా బెనర్జీపై కేసు నమోదు..

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీపై సుమోటోగా పోలీసులు FIR నమోదు చేసారు. కోల్‌కతాలోని క్యాథడ్రల్ రోడ్డులో తృణమూల్ ఛాత్ర పరిషత్ ప్రభుత్వ (TMCP) వ్యవస్థాపక దినోత్సవ సభ జరిగింది. దీంతో ఈ సభకు సంబంధించి కొన్ని షరతులును కోల్‌కతా హైకోర్టు విదించింది.

రోడ్డులో ఒక వైపు ట్రాఫిక్ కోసం ఖాళీగా ఉంచాలని, కేవలం 1,500 మంది మాత్రమే సభకు హాజరుకావాలని కోర్టు తెలిపింది. దీంతో నిబంధనలను ఉల్లంఘించి రోడ్డును పూర్తిగా మూసివేశారని, అనుమతించిన పరిమితికి మించి జనాలను సమీకరించారని పోలీసులు మమతా బెనర్జీపై FIR నమోదు చేసారు.

మమతా బెనర్జీతో పాటు టీఎంసీపీ సభ నిర్వాహకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని పలు సెక్షన్ల కింద మమతాపై పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారని సమాచారం. ఈ సంఘటనను మమతా వర్గం వ్యతిరేకింది. అక్రమంగా మమతాపై కేసులు నమోదు చేసారంటూ పార్టీలో కొంత మంది నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |