UPDATES  

NEWS

 డ్రోన్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులకు సిమ్ కార్డులు సప్లై.. నిందితుడి అరెస్ట్..!

డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ లో ఉంటున్న ఉగ్ర హ్యాండ్లర్లకు సిమ్ కార్డులు సప్లై చేస్తున్న వ్యక్తిని రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే సదరు నిందితుడు 8సిమ్ కార్డులను పాక్ కు చేరవేసినట్టుగా విచారణలో తేలింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రం జైసల్మేర్ జిల్లా శ్రీ గంగానగర్ పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది. కాగా, శ్రీ గంగానగర్ స్టేషన్ పరిధిలోని అనూప్ ఘడ్ లో నివాసం ఉంటున్న బల్వీందర్ సింగ్ అలియాస్ బింద్రా పాకిస్తాన్ లో ఉంటూ మన దేశంలో హింసను సృష్టించటానికి కుట్రలు చేస్తున్న కొందరికి డబ్బు తీసుకుంటూ సహకరిస్తున్నాడు.

ఈ క్రమంలోనే స్థానికంగా ఉంటున్న వారి పేర్లపై 8 సిమ్ కార్డులు తీసుకున్నాడు. వాటిని డ్రోన్ ద్వారా పాక్ లోని హ్యాండ్లర్లకు అందచేశాడు. ఈ మేరకు పక్కా సమాచారాన్ని సేకరించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బల్వీందర్ సింగ్ 8 సిమ్ కార్డులను సరిహద్దు అవతలి ఉన్న పాక్ హ్యాండ్లర్లకు అందజేసినట్లు విచారణలో తేలింది. ఈ సిమ్ కార్డులను ఉపయోగించి పాక్ హ్యాండ్లర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసినట్టుగా తేలింది. వాటి ద్వారా దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన వ్యూహాత్మక సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించినట్టుగా తెలిసింది.

బల్వీందర్ సింగ్ గతంలో పాకిస్థాన్ నుంచి డ్రోన్ ద్వారా భారత్‌‌లోకి 55 కోట్ల విలువ చేసే 10.5 కిలోల హెరాయిన్‌ను రప్పించిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. జైసల్మేర్ లో నమోదైన ఈ కేసులో అతనిపై 25వేల రూపాయల రివార్డును అధికారులు ప్రకటించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. పాక్ హ్యాండ్లర్లతో జరిపిన చాటింగ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాలు, పాక్ గూఢచర్య నెట్‌వర్క్‌ తో అతనికి ఉన్న ఉన్న లింకులపై దర్యాప్తును ముమ్మరం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |