UPDATES  

NEWS

 పార్టీ లో అవినీతి నాయకులపై పోరాటానికి సై అంటున్న మాజీ mla ప్రభాకర్ చౌదరి

అనంతపురం నగరంలో ఏ టిడిపి కార్యకర్తకు, నాయకులకు ఏమైనా జరిగితే అందుకు మొదటి ముద్దాయిగా దగ్గుబాటి ప్రసాద్ పేరును సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని ఎస్పీ జగదీష్ వేడుకుంటున్నట్లు టిడిపి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తీరును ఎండగట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో నగరంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన అవినీతి అక్రమాలు అరాచకాలకు సంబంధించి 1000 పేజీలతో కూడిన ఆధారాలు నా వద్ద ఉన్నాయనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఎంతోమంది కార్యకర్తలు కష్టపడి పనిచేసి అఖండ విజయాన్ని అందించారని, అంతే శ్రద్ధతో పాలన సాగించాల్సిన కొందరు ఎమ్మెల్యేల దుర్నీతి వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందన్నారు. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావుకి జిల్లా పార్టీ అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పదవులను ఆశించకుండా పార్టీ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నానని పార్టీకి నష్టం చేకూరేలా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఎంతోమంది పార్టీ కార్యకర్తలు జరుగుతున్న అన్యాయం గురించి తన వద్దకు వచ్చి మొరపెట్టుకుంటుంటే పార్టీకి నష్టం జరుగుతోందని ఆవేదనతో నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తోందన్నారు. అనంతపురం నగరంలో ఒక ప్లాట్ కొనాలన్న జనం భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లో పనిచేసే పోలీసులను తక్షణమే ఇక్కడ నుంచి బదిలీ చేయాలన్నారు. అమరావతి పూర్తవ్వాలి, పోలవరం పూర్తవ్వాలి , రాష్ట్రం బాగుపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తుంటే స్థానికంగా ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాల వల్ల కేడర్ నష్టపోతోందన్నారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాను చెబుతున్నానని ఇక్కడ జరుగుతున్న వాటికి సంబంధించి సమగ్ర విచారణ జరిపిస్తాము అంటే 300 మంది నష్టపోయిన పార్టీ కార్యకర్తలను మీ ముందుకు తీసుకొస్తానని , వారికి న్యాయం చేస్తే సంతోషిస్తానని ఆయన తెలిపారు.ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నాను అనంతపురం నగరంపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని ప్రాధేయ పడుతున్నాను అన్నారు. నాకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఏ పదవి వద్దని పార్టీని బతికించుకుని రానున్న రోజుల్లో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. తాను

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |