UPDATES  

NEWS

 22A జాబితాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు..

22A జాబితా వెనుక కుట్ర ఉండొచ్చు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేస్తామన్నారు. దీనిపై బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల పాత్ర ఉండవచ్చుని మంత్రి స్పష్ట్రం చేశారు.

ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర ఉందని అనుకుంటున్నామని, బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హమీ ఇచ్చారు. దీనికోసం ఎవరు దరఖాస్తులు చేసుకోవద్దని తెలిపారు. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. పొరపాటున జరిగిందా లేక ఎవరైనా కావాలనే చేశారా అనేది విచారణ చేస్తామని మంత్రి తెలిపారు.

యాదగిరిగుట్టలో 42 వేల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో పెట్టారని దీన్ని సీఎంకు నాలుగు నెలల క్రితమే చెప్పామని కోమటి రెడ్డి అన్నారు. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేసి ఉండవచ్చు. బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. 30 శాతం కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో బయటపడుతుందని ఫైర్ అయ్యారు.

సీఎం అమెరికా టూర్ తర్వాత దీనిపై శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. మా ప్రభుత్వం మంచితనాన్ని కొంతమంది అధికారులు దుర్వినియోగం చేసి ఉండవచ్చు. తప్పు ఎవరిదో తేలితే వాళ్లను ఏం చేయాలో మాకు తెలుసని మంత్రి ఫైర్ అయ్యారు. 22Aలో మధ్యతరగతి పేదలకు అన్యాయం చేస్తే ఊరుకోనని, ప్రతిపక్షాల విమర్శలు అర్థం లేనివని అన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |