UPDATES  

NEWS

 జమ్ముకశ్మీర్‌లో వలస కార్మికులపై ఉగ్రవాదుల దాడి.. ఒకరు బలి..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి ఒడిగట్టారు. వలస కార్మికులే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా కెల్లం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

 

పోలీసుల కథనం ప్రకారం, ఒక ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్ అనే కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన భూపేందర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.

 

దాడి అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పరారైన ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. గత పది రోజుల వ్యవధిలో కశ్మీర్ లోయలో ఇది రెండో లక్షిత దాడి కావడం గమనార్హం. గత వారం అనంతనాగ్‌లో ఓ పోలీసు అధికారిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ప్రస్తుతం అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతున్న వేళ, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఈ తరహా దాడులు జరగడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |