UPDATES  

NEWS

 ఫార్ములా-ఈ స్కామ్‌లో KTR A-1.. ఏసీబీ 77 పేజీల ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు..!

2023 ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా-ఈ రేసుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన యాంటీ కరప్షన్ బ్యూరో.. ఇప్పుడు కోర్టులో 77 పేజీల ఛార్జ్‌షీట్‌ వేసింది. కేసులో A-1గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును చేర్చిన ఏసీబీ అధికారులు.. మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిల పాత్రను బయటపెట్టారు. కేబినెట్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్, లా డిపార్ట్‌మెంట్స్‌కు ముఖం చాటేసి.. కేటీఆర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల హెచ్‌ఎండీఏ ఖజానా ఖాళీ అయిందని తేల్చింది ఏసీబీ. ఎఫ్‌ఈఓ కంపెనీకి 54.88 కోట్లు అడ్డగోలుగా మళ్లించడంతో పాటు, ఓవరాల్‌గా ప్రభుత్వానికి 600 కోట్ల భారం పడిందని.. హెచ్‌ఎండీఏకు 75.88 కోట్ల నష్టం జరిగిందని తేల్చింది ఏసీబీ.

 

ఛార్జ్‌షీట్‌లో ట్విస్ట్..

 

కేటీఆర్ ఆదేశాలతో ఐఏఎస్ అరవింద్ కుమార్ తన పవర్‌ను మిస్‌యూజ్ చేస్తూ సంతకాలు చేసుకుంటూ పోయారని ఛార్జ్‌షీట్‌లో ఉంది. సీజన్-1లో భారీగా మునిగిపోయిన ‘ఏస్ నెక్స్ట్-జెన్’ సంస్థను కాపాడేందుకు.. 160 కోట్లు రిలీజ్ చేస్తూ హడావుడిగా నోట్ ఫైల్ రెడీ చేశారు.

 

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆశ చూపి సంతకాలు..

 

ఇదంతా కేవలం పర్సనల్ బెనిఫిట్స్ కోసం జరిగిన బిగ్ స్కామ్ అని ఏసీబీ తన ఛార్జ్‌షీట్‌లో కుండబద్దలు కొట్టింది. ఏస్ నెక్స్ట్-జెన్‌కు లబ్ధి చేకూర్చినందుకు.. ప్రతిఫలంగా ఆ సంస్థ అనుబంధ సంస్థ గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఏకంగా 44 కోట్లు ముట్టాయని.. ఇది పక్కా క్విడ్ ప్రో కో అంటూ ఆధారాలు సేకరించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆశ చూపి బీఎల్‌ఎన్ రెడ్డితో సంతకాలు పెట్టించారని స్పష్టం చేసింది. ఇక కోర్టు విచారణలో భాగంగా.. కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలు పర్సనల్‌గా హాజరుకాగా.. లక్ష చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించిన జడ్జి.. నెక్స్ట్ హియరింగ్‌ను ఆగస్టు 25కి వాయిదా వేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |