UPDATES  

NEWS

 వందేమాతరం బిల్లుకు లోక్ సభ ఆమోదం..

జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడం లేదా దాని గానానికి ఆటంకం కలిగించడాన్ని నేరంగా పరిగణించే కీలక బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం ముద్ర వేసింది. జాతీయ గౌరవ పరిరక్షణ (సవరణ) బిల్లు, 2026ను ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. నిన్న ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది.

 

1971 నాటి జాతీయ గౌరవ పరిరక్షణ చట్టానికి ఈ బిల్లు సవరణలు చేపడుతుంది. ఇప్పటివరకు జాతీయ జెండా, రాజ్యాంగం, జాతీయ గీతం ‘జన గణ మన’కు మాత్రమే ఉన్న చట్టపరమైన రక్షణ ఇకపై వందేమాతరం గేయానికి కూడా వర్తించనుంది. నూతన నిబంధనల ప్రకారం, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వందేమాతరం గానానికి ఆటంకం కలిగించినా లేదా దానిని అవమానించినా గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది.

 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. జాతీయ గీతంతో సమానంగా వందేమాతరానికి సమున్నత గౌరవం కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ఆయన ఈ సందర్భంగా వివరించారు. సభలో చర్చ కొనసాగుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఇతర అంశాలపై పట్టుబడుతూ నిరసనలు వ్యక్తం చేయగా, వారు ప్రతిపాదించిన సవరణలను సభ తోసిపుచ్చింది. వందేమాతరం 150వ వార్షికోత్సవాల నేపథ్యంలో ఈ బిల్లును తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |