UPDATES  

NEWS

 మనం పొత్తులో ఉన్నాం.. అన్ని పదవులు ఒకేసారి అడగలేం.. మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు..

మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మనం పొత్తులో ఉన్నామని, అన్ని పదవులు ఒకేసారి అడగలేమని తేల్చేశారు. మనం పని చేసేది పవన్ కల్యాణ్ నాయకత్వం కోసమని, పవన్ కోసమని అన్నారు. ఎటువంటి విభేదాలు, అనవసర రాద్ధాంతాలు మానుకోవాలని కేడర్ హితవు పలికారు. చిన్న సమస్యలపై ఒకరినొకరు దూరం చేసుకోవద్దన్నారు.

 

పొత్తులో ఉన్నాం- అన్ని పదవులు అడగలేం- ఓట్ల కోసం గ్రూప్ రాజకీయాలు ఉండాలని, పోటీ చేసినప్పుడు ఉండాలన్నారు. మనమంతా పవన్ కల్యాణ్ గ్రూప్ అని అన్నారు. ఆయన నాయకత్వంలో అందరం పని చేయాలన్నారు. ప్రతీ ఒక్కరికీ అవకాశం ఇవ్వాలని అధినేత పవన్ కోరుకుంటారని గుర్తు చేశారు. శుక్రవారం జనసేన సమీక్ష సమావేశం నిర్వహించారు.

 

దీనికి ఆ పార్టీకి చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మన పార్టీ ఇంకా ఎదగాలని, దిగువ స్థాయిని పార్టీని బలోపేతం చేయాలన్నారు. పార్టీ నిర్మాణం ఇంకా జరగాలన్నారు. దీని కోసం అధినేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు.

 

మనకు టీవీ ఛానెల్స్ లేవు.. పేపర్లు లేవు- మనకు టీవీ ఛానెళ్లు, పేపర్లు లేవన్నారు మంత్రి నాదెండ్ల. కావాలని వార్తలు రాయించుకునే అలవాటు మనకు లేదన్నారు. చేసిన పని చూపించుకోవడానికే ఓ ప్రయత్నం చేస్తామన్నారు. దేశంలో పంచాయతీరాజ్ శాఖను రెండో స్థానంలోకి పవన్ తీసుకెళ్లారని, ఈ విషయంలో పెద్ద పెద్ద పబ్లిసిటీలు చేసుకోలేదన్నారు. కష్టపడి పని చేయడమే మనకు తెలుసన్నారు.

 

ప్రజలకు ఇచ్చిన మాటకు విలువ ఇచ్చి ఈ రోజు ప్రభుత్వంలో నిలబడుతున్నట్లు వివరించారు. ప్రజాస్వామ్యం నిలబెట్టే విధంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. విజయవాడ డివిజన్లలోని నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమస్యలపై అవగాహన తెచ్చుకోవాలన్నారు.

 

పార్టీలో పొరపాట్లు చేస్తే ప్రశ్నించవచ్చు- పార్టీలో చిన్ని చిన్న పొరపాట్లు చేస్తే అడగాలని, ప్రశ్నించాలన్నారు. ఈ విషయంలో తప్పేమీ లేదన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యల వెనుక కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు జనసేన పార్టీలోని కొందరు నేతలు. చాలామంది నేతలు, కార్యకర్తలు పదవులు లేక అసంతృప్తిగా ఉన్నట్లు తేలడంతో ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |