UPDATES  

NEWS

 హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల కలకలం..!

దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణా కేంద్రమైన హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న తీవ్ర ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి అనే ట్రైనీ ఐపీఎస్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

 

వివరాల్లోకి వెళితే, అకాడమీలో శిక్షణ పొందుతున్న ఒక ఐపీఎస్ ప్రోబేషనర్, తన సహోద్యోగి అయిన ఉదయ్ కృష్ణారెడ్డి తనను కొంతకాలంగా వేధిస్తున్నాడని అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడంతో పాటు, మానసికంగా వేధిస్తూ, దుర్భాషలాడుతున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

ఈ క్రమంలో జూలై 9న నిందితుడు తనను బలవంతంగా ఒక గదిలోకి లాక్కెళ్లాడని, జుట్టు పట్టుకుని మెడపై కత్తి పెట్టి బెదిరించాడని బాధితురాలు ఆరోపించారు. అంతేకాకుండా, ఆమె ప్రైవేట్ వీడియోలను బలవంతంగా చిత్రీకరించి, ఆమె మొబైల్ ఫోన్ లాక్కుని, ఆ వీడియోలను ఆమె భర్త వాట్సాప్‌కు పంపాడని ఫిర్యాదులో వివరించారు.

 

బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన అత్తాపూర్ పోలీసులు, నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 74, 75, 77, 315(2)తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66(C) కింద కేసు నమోదు చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |