UPDATES  

NEWS

 భోగాపురం విమానాశ్రయం సిద్ధం.. త్వరలో ప్రారంభం: రామ్మోహన్ నాయుడు.

ఉత్తరాంధ్రలో కొత్త అభివృద్ధి చరిత్రకు నాంది పలుకుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి స్థాయికి చేరుకుంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో జీఎంఆర్ సంస్థ షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఇప్పటికే ఎయిరోడ్రోమ్ లైసెన్స్ వచ్చేసిందని వెల్లడించారు.

 

ప్రధాని మోదీ సమయం ఖరారు చేస్తే వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ వేడుక ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. 78 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైన టెర్మినల్ భవనం సంవత్సరానికి ఏకంగా నాలుగు కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంటుందని చెప్పారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, కళలు ఉట్టిపడేలా డిజైన్ చేయడంతో ఇది దేశంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రారంభం అయిన వారం లోపు విశాఖ విమానాశ్రయ కార్యకలాపాలను భోగాపురానికి మార్చి పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభిస్తామని తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |