UPDATES  

NEWS

 నీట్ పరీక్ష లీక్ వ్యవహారం.. రంగంలోకి దిగిన సీబీఐ..!

నీట్ (యూజీ) 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారానికి సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసింది. కేంద్ర విద్యా శాఖ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.

 

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశించడంతో, సీబీఐ రంగంలోకి దిగింది. నేరపూరిత కుట్ర, మోసం, ఇతర నేరాలకు సంబంధించి బీఎన్ఎస్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రాజస్థాన్ పోలీసుల నుంచి సమాచారాన్ని సేకరించడానికి త్వరలో ఒక బృందాన్ని అక్కడకు పంపించనున్నారు. 2024లోని నీట్ పేపర్ లీక్ కేసులను కూడా సీబీఐ ఛేదించింది

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |