UPDATES  

NEWS

 జోగి రమేశ్ వ్యాఖ్యలపై కోడలు కౌంటర్..! గుట్టు అంతా బయటపెట్టిన కోడలు..!

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఫ్యామిలీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. టీవీల్లో సీరియల్ మాదిరిగా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. సోమవారం మీడియా ముందుకొచ్చిన జోగి రమేశ్, ఫ్యామిలీలో అలాంటి గొడవలు సహజమేనని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయన కోడలు మేఘన కౌంటరించారు. అంతేకాదు కొన్ని విషయాలను బయటపెట్టారు.

సోమవారం మీడియా ముందు జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కోడలు మేఘన మండిపడింది. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తేల్చేశారు ఆమె. వివాహం తర్వాత ఎన్నో ఆశలతో తాను అత్తవారింటిలో అడుగు పెట్టానని వెల్లడించారు. అత్తమామలు తల్లిదండ్రులను భావించిన తన పడుతున్న కష్టాలను వివరించానని తెలిపారు. ఇలా జరుగుతోందని, తనతో సరిగా ఉండలేదని చెప్పానని వివరించారు.

ఇద్దరు కూర్చొబెట్టి సమస్యపై చర్చించాల్సిన అత్త, అదనపు కట్నం కోసం తనను అన్ని విధాలుగా తనను వేధింపులకు గురి చేశారని ప్రస్తావించారు. పనిలోపనిగా తనపై మామ జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం మేఘన మీడియా ముందుకొచ్చారు.

అసలు వాస్తవాలు ఏంటో ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించానని పేర్కొన్నారు. తన దగ్గరున్న ఆధారాలు అన్నీ పోలీసులకు అందజేశానని తెలిపారు. అత్తింటివారిది రాజకీయ నేపథ్యమని, మాది అసలు రాజకీయ నేపథ్యం కాదని, వ్యాపార నేపథ్యానికి చెందిన ఫ్యామిలీ అని పేర్కొన్నారు.

తల్లి స్థానంలో ఉన్న అత్త..  తన బాధను అర్థం చేసుకుంటారని భావించానని, ఎందుకంటే తనకు ఆడపిల్ల ఉందన్నారు. అదంతా వ్యతిరేకమని తనకు తర్వాత అర్థమైందన్నారు. తనకు తగిలిన మరొక షాక్ గురించి వివరించారు మేఘన. వివాహానికి ముందు హిందువులను చెప్పారని, ఆ తర్వాత తనకు తెలిసిన విషయం తెలిసిందన్నారు.  వారు క్రైస్తవ మతస్తులని వివరించారు.

బయట ఏం చేస్తారనేది తనకు తెలీదని, ఇంట్లో ఏం జరుగుతుందో వాటిని తాను పరిగణనలోకి తీసుకుంటానని తెలిపారు. ఇంట్లో పూజ గది లేదన్నారు. హిందూ పూజలు, కార్యక్రమాలు లేవన్నారు. అబ్బాయితో సమస్య ఒకటైతే, రెండోది మరొక మతస్తులని తెలియకుండా పెళ్లి చేశారని తెలిపారు. ఆ మతాన్ని ఫాలోకావడం తప్పుగా భావించలేదని, ఎవరి దేవుడ్ని వారు గౌరవిస్తారన్నారు.

ఈ విషయంలో చెప్పకుండా మోసం చేశారని మండిపడ్డారు. తాను మాట్లాడిన ప్రతీ మాటకు సరైన ఆధారాలు ఉన్నాయని అన్నారు. తనపై రాబోయే రోజుల్లో తప్పుడు ప్రచారం చేస్తారని మనసులోని మాట బయటపెట్టారు. తన వద్ద ఇంకా ఆధారాలు ఉన్నాయని, వాటిని సమయం, సందర్భం బట్టి బయటపెడతానని  తెలిపారు.

ఫిర్యాదు చేసేందుకు సీపీ వద్దకు వెళ్లామని, రాజీ చేసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారని వివరించారు. న్యాయం చేస్తానని సజ్జల చెప్పారని, కాలయాపన తప్ప, సమస్య పరిష్కరించేలా కనిపించలేదన్నారు. పెళ్లయిన రెండు నెలలకే రాజీవ్ తనపై నల్ అండ్ వాయిస్ కేసు వేశారని గుర్తు చేశారు. రాజీవ్ విడాకుల కోసం వెళ్లినట్టు తనకు ఆలస్యంగా తెలిసిందన్నారు. తనను వదిలించుకోవడానికి అనేక కట్టుకథలు చెప్పుకొచ్చారని తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |