UPDATES  

NEWS

 రేషన్ కార్డుల ప్రింటింగ్‌లో భారీ స్కామ్.. బయటపెట్టిన ఎమ్మెల్సీ దాసోజు..!

రాష్ట్రంలోని నిరుపేదల ఆకలి తీర్చే రేషన్ కార్డులను తమ సొంత రాజకీయ ప్రచార కరపత్రాలుగా మార్చుకొని ప్రజాధనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. 119 నియోజకవర్గాల్లో ప్రారంభించిన 1.05 కోట్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పేరిట 100కోట్లు ఖర్చు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వడానికి నిధులు లేవని, ఉద్యోగుల పెన్షన్లు, గ్రాట్యుటీ బకాయిలు చెల్లించలేమని చేతులెత్తేసిన ఈప్రభుత్వం.. ఇప్పటికే ఉన్న ఈ-కార్డులను రద్దు చేసి, సీఎం,మంత్రి ఉత్తమ్ ఫొటోలతో కూడిన లామినేషన్ కార్డుల కోసం ఏకంగా ₹100 కోట్లు ఖర్చు చేయడంసిగ్గుచేటని విమర్శించారు.క్లౌడ్ సర్వర్లు, స్పెషల్ వెబ్‌సైట్లు, ప్రింటింగ్, లామినేషన్, 33 జిల్లాల్లో రవాణా పేరిట ఒక్కో కార్డుకు దాదాపు ₹100 చొప్పున ప్రజల జేబులు కొట్టి సొంత డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు.

2021లో కోవిడ్ సర్టిఫికెట్లపై ప్రధాని మోడీ ఫొటో ముద్రిస్తే.. ప్రియాంక గాంధీ మొదలుకొని గల్లీ లీడర్ దాకా “ప్రజల ప్రాణాలు కాపాడే వాక్సిన్లు మోడీ వ్యక్తిగత ప్రచార సాధనాలుగా మారాయని నానా యాగీ చేశారని వారి ఒత్తిడికి తలొగ్గి,గోవా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం, మోడీ ఫొటోలను తొలగించాలని ఆదేశించిందన్నారు.మరి నాడు మోడీకి వర్తించిన నియమాలు నేడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వర్తించవా అని నిలదీశారు? రేషన్ కార్డు అనేది జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కుఅన్నారు.

ప్రభుత్వ ప్రకటనలపై సిట్టింగ్ సీఎం ఫోటోకు మాత్రమే పరిమిత మినహాయింపు ఉందని, కేబినెట్ మంత్రి ఫోటో కూడా పెట్టడానికి వీలులేదని,కానీ నిబంధనలను తుంగలో తొక్కి పౌరసరఫరాల శాఖ మంత్రి ఫోటో ముద్రించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. రేషన్ కార్డులపైనుంచి వెంటనే సీఎం, మంత్రి ఉత్తమ్ టోలను తొలగించి, అధికారిక రాజముద్రతో కూడిన సాధికారిక కార్డులను ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ100 కోట్ల దుబారాపై తక్షణమే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ – CAG) తో సమగ్ర ఆడిట్ జరిపించి, బాధ్యులైన వారి నుంచి రికవరీ చేయాలని కోరారు. తక్షణమే ఈ ఫోటో కార్డుల డ్రామా ఆపి, ప్రజల సొమ్మును ప్రజా సంక్షేమానికే ఖర్చు చేయాలని కోరారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |