UPDATES  

NEWS

 దేశంలోనే అత్యంత డర్టీ పొలిటీషియన్ చంద్రబాబే: మాజీ మంత్రి రోజా..

స్వాతంత్ర్య దినోత్సవం సాక్షిగా చంద్రబాబు మహిళలను మోసం చేశారని వైసీపీ మాజీ మంత్రి రోజా మండి పడ్డారు. మహిళలను బస్సులో ఎక్కించుకొని తిప్పుకొని, ఆకరికి అన్నం పెట్టకుండా పంపించాడని అన్నారు. మహిళలను చంద్రబాబు అవమానించారని అందుకు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోనే చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ ఎవరు లేరని ఫైర్ అయ్యారు.

ఓటుకు నోటు పరిచయం చేసింది చంద్రబాబే అని, వైస్రాయి హోటల్‌లో ఎన్టీఆర్ పై చెప్పులు విసిరించిన సంస్కృతి చంద్రబాబుదేనని అన్నారు. చంద్రబాబుకు రెండెకరాల ఉంటే తమ్ముడికి ఒకేకరా పోతే ఇక ఒక ఎకరా ఉండేదని అన్నారు. ఇప్పుడు లక్షల కోట్లు చంద్రబాబుకు ఎలా వచ్చాయని, నగరిలో పిల్లికి కూడా భిక్షం పెట్టని ఎమ్మెల్యే భాను ఇసుక, మట్టి తమిళనాడు, కర్ణాటకకు తరలించి అక్రమ సంపాదన సంపాదిస్తున్నారని అన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలి భానుకి సహకరిస్తున్నారని తెలిపారు.

ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. మధ్యం దుకాణాల పేరుతో బెల్టు పెట్టీ యువతను మత్తుకు బానిస చేస్తున్నారని అన్నారు. ఆ మత్తులో మహిళలపై దాడులు, అగాయిత్యాలు జరుగుతున్నాయని, కుప్పంలో గంజాయిని పెంచి పోషిస్తున్నారని అన్నారు. హోం మంత్రి ఉన్న నియోజకవర్గంలో గంజాయి సాగు చేస్తున్నారు. మహిళల చేతిలో చావు దెబ్బ తింటారని రోజా సంచనల వ్యాఖ్యలు చేశారు. కారు గ్యారేజీలో ఉండాలి, ఆడది వంటగదిలో ఉండాలి అన్న కోడెల ఏమయ్యాయో చూసాం చంద్రబాబు కన్నా చిన్న వాడు జగన్, ఇచ్చిన హామీలన్నీ 98 శాతం నెరవేర్చారని తెలిపారు. అమరావతిలో అనవసరంగా డబ్బులు పెడుతూ దోచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |