UPDATES  

NEWS

 ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ మీటింగ్.. కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ భేటీ..!

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఢిల్లీలో ఏఐసీసీ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ భేటి అయ్యారు. పలుకీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో రాజకీయ అంశాలపై మాట్లాడనున్నారు.

 

ముఖ్యంగా ఆరు అంశాలు..

సంస్థాగత సమస్యలపై రాష్ట్రాలవారిగా ఏఐసీసీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆరు అంశాలపై అధిష్టానానికి ముఖ్యంగా నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తుంది. సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా, జాతీయ స్థాయి నుండి పోలింగ్ బూత్ స్థాయి వరకు సంస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ పనిచేస్తుంది.

 

మహేష్ కుమార్ గౌడ్..

సంస్థాగత సంపూర్ణత, బాధ్యతల అప్పగింత, శిక్షణ మరియు సామర్థ్య నిర్మాణం, సంస్థాగత క్రమశిక్షణ- సమావేశాలు, అనుసంధాన కేంద్రాలు – పనితీరు సమీక్ష, కాంగ్రెస్ కనెక్ట్ ప్లాట్‌ఫారమ్ వినియోగం అంశాలపై అధిష్టానానికి నివేదిక అందజేయనున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వీటితో ప్రస్థుతం రాష్ట్రంలో నెలకొన్న ముణ్యమైన అంశాలపై కూడా కీలక మైన రాజకీయ అంశాలపై చర్చించనున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |