UPDATES  

NEWS

 ఆగస్టు నుంచి ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన..!

కర్నూలు జిల్లాలోని స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ.197 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. అనంతరం సంజీవని బహిరంగ సభలో మాట్లడారు. సీఎం అంటే సెక్రటేరీయేట్‌లో ఉండే చీఫ్ మినిస్టరే కాదు.. ప్రజలతో ఉండే కామన్ మ్యాన్ అనేది నా భావన.. అందుకే నిత్యం ప్రజలతోనే ఉంటున్నానని అన్నారు. నిత్యం ప్రజలతో ఉంటేనే ఉత్సాహంగా ఉంటానని, నెలలో నాలుగు కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలు రూపొందించుకున్నాంమని తెలిపారు.

 

రాష్ట్రవ్యాప్తంగా అమలు..

ప్రజల సమస్యలను నేరుగా విని అందరి భవిష్యత్తు కోసం ప్రజా పాలసీలు తీసుకువస్తున్నాను. దాంట్లో భాగంగానే ప్రతి నెల సంజీవని కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తున్నానని, ప్రజల ఆరోగ్యం కాపాడే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేలా సంజీవని ప్రాజెక్టును తెస్తున్నాం మన్నారు. ప్రతీ కుటుంబం, విద్య, వైద్యంపైనే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోందని, సంజీవని ప్రాజెక్టును ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని హమీ ఇచ్చారు. ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పని చేస్తుదన్నారు.

 

వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు..

 

గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ పెంచడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రిడెక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో ప్రజారోగ్య రక్షణే ‘సంజీవని’ విధానం. ప్రజల వ్యక్తిగత ఆరోగ్య రికార్డులు తయారు చేసి వాటి ద్వారా ఆరోగ్య భద్రత ఇచ్చేందుకే సంజీవని ప్రాజెక్టు చేపట్టామని సీఎం తెలిపారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి రాష్ట్రస్థాయి వరకూ డేటా అనుసంధానం అవుతుందని, ప్రతీ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ ను సంజీవని ద్వారా నమోదు చేస్తున్నిమని తెలిపారు. రాష్ట్రంలో 80 లక్షల మంది తీవ్ర వ్యాధుల బారిన పడినట్టు నివేదికలు వచ్చాయని తెలిపారు.

 

అన్న క్యాంటీన్ ద్వారా..

 

మహిళలకు సాధికారిత కల్పించేలా స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్నాంమని, వంట కష్టాలు తీర్చేలా దీపం-2.0 అమలు చేస్తున్నామన్నారు. గ్యాస్ సిలిండర్ రాయితీని ఖాతాలకు వేసేలా చర్యలు చేపడుతున్నామరని, ప్రతీ ఇంటికీ సౌర విద్యుత్ ద్వారా వెలుగులు నింపేలా చర్యలు చేపడుతూ.. ఎన్డీఏ ప్రభుత్వం పేదల పక్షాన వారి జీవన ప్రమాణాలు పెంచేలా పనిచేస్తూనే ఉంటుందని తెలిపారు. అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నం పెడుతుంటే గత పాలకులు సహించలేక పోయారు.

 

రాయలసీమ కోసం..

గత పాలకులు ప్రజల ఆస్తుల్ని 22 ఏ కింద పెట్టేసి వాటిని కాజేసేందుకు ప్రయత్నించారని ఫైర్ అయ్యారు. అందుకే రీసర్వే ప్రక్రియ ద్వారా రికార్డులను బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా భద్రత కల్పిస్తున్నాని సీఎం తెలిపారు. 2028లోగా కడప స్టీల్ పరిశ్రమను నిర్మించి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టామని, హీరో మోటార్స్ సంస్థ, ఎల్ జీ, దాల్మియా లాంటి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వస్తున్నాయని, రూ.1 లక్ష కోట్ల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను ఉద్యాన హబ్ గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్ట్రం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |