UPDATES  

NEWS

 ఉద్యమకారుల కోసం పోరాడి.. బీఆర్ఎస్‌లో బలయ్యాను.. కవిత సంచలన వ్యాఖ్యలు..

ఉద్యమకారులకు న్యాయం చేసే విషయంలో ఆలస్యం చేయవద్దని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కోరారు. స్వతంత్రత సైనిక్ సమ్మాన్, హైదరాబాద్ లిబరేషన్ మూమెంట్ రూల్ పొజిషన్ ను కమిటీ స్టడీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అమరజ్యోతిలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశానికి మంగళవారం హాజరై కమిటీకి 57 పేజీల నివేదికను కవిత అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించటం, గౌరవించటం కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు.

 

ఉద్యమకారులకు మేలు చేసేందుకు తన వంతుగా సూచనలు ఇచ్చే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నట్లు కవిత తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందంటూ అంతర్గత వేదికల్లో చెప్పి వారి కోసం పోరాటం చేశానని పేర్కొన్నారు. దాని పర్యవసానంగానే బీఆర్ఎస్ లో బలైన వ్యక్తిని తానని చెప్పుకొచ్చారు. తాను చెప్పే మాటలతో ఉద్యమకారులకు మేలు జరిగితే తన జన్మ ధన్యమైనట్లు భావిస్తానన్నారు., అన్న విషయాన్ని

భారత ప్రభుత్వం.. స్వతంత్రత సైనిక్ సమ్మన్ యోజన పేరుతో లక్షా 71 వేల మందికి పెన్షన్లు ఇచ్చిందన్నారు. వాళ్లు చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబానికి మేలు జరిగేలా రూల్ పొజిషన్ ఉందని, దాన్ని కమిటీ స్టడీ చేయాలని కోరారు. ఆ స్కీమ్ పెట్టినప్పుడు ఒక్క బ్రిటీష్ ప్రభుత్వంపైనే కాకుండా ఫ్రెంచ్, పోర్చుగీస్ వాళ్లపై పోరాటం చేసిన వాళ్లను కూడా గుర్తించారన్నారు. మనం కూడా 1969 ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను ఇందులో జత చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

తెలంగాణ ఉద్యమంలో కూడా జైల్లో ఉన్నవాళ్లు, ఎఫ్ఐఆర్ లు, ఛార్జిషీట్లు నమోదైన వాళ్ల విషయంలో ఆలస్యం చేయకుండా వారిని గుర్తించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అలాంటి వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో జాబ్ పోయిన వాళ్లకు మేలు చేయాలని గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉందన్నారు. ఉద్యమకారులు ఎవరైనా చనిపోతే మొదటి ప్రియారిటీ వాళ్ల భార్య, లేదంటే పిల్లలు, తల్లితండ్రులకు ఇవ్వాలనికోరారు.

మరోవైపు రాష్ట్రంలో ఏ స్కీమ్ పెట్టిన సరే స్కామ్ అవుతుందని, అందుకే స్కామ్ జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఉద్యమకారులు బిక్షాటన చేసి ఆందోళనలు చేసిన తర్వాత గానీ కమిటీ ఏర్పాటు చేయలేదన్నారు. జార్ఖండ్ లో ఉద్యమకారులకు వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు, గుర్తింపు కార్డులు ఇస్తున్నారని, అక్కడ పర్మినెంట్ కమిటీ ఉందని పేర్కొన్నారు. ఇక్కడ కూడా ఆ విధంగా ఏర్పాటు చేయాలని కోరారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |