UPDATES  

NEWS

 ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు వేరు వేరుగా పోటీ..? నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. కూటమిలోని పార్టీలు ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. నేతలతో అధినేతలు సమావేశాలు, కేడర్‌తో భేటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పరిస్థితులను బట్టి వెనక్కి తగ్గామన్నారు.

 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షురూ-ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రంగం షురూ అవుతోంది. అక్టోబరు లేకుంటే నవంబర్‌లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని కూటమి భావిస్తోంది. ఈలోగా నేతలు, కేడర్‌ని సమాయాత్తం చేస్తున్నాయి టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు. వారంలో ఎలాగ లేదన్నా నేతలతో ఒక్కసారి భేటీ అవుతున్నారు అధినేతలు. జరుగుతున్న పరిణామాలు గమనించిన వైసీపీ కూడా అదే బాటలో నడుస్తోంది.

 

కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి నాదెండ్ల-వైసీపీని ఒకటే సమస్య వెంటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కూటమి కలిసి వెళ్తుందా? లేకుంటే ఆయా పార్టీలు విడి విడిగా పోటీ చేస్తారా? అనే డౌట్ అనుక్షణం వెంటాడుతోంది. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చేశారు. శుక్రవారం తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన, 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.

 

అప్పుడు ఓ అడుగు వెనక్కి తగ్గాం-అప్పటి పరిస్థితిని బట్టి ఓ అడుగు వెనక్కు తగ్గామన్నారు. అప్పుడు వర్తించిన ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికలకు ఉంటుందని చెప్పడం సరికాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి వెళ్లాలా లేకుంటే సొంతంగా పోటీ చేయాలా అనేదానిపై ఎన్డీయే కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పేశారు.

 

స్థానిక పరిస్థితులు, పార్టీ బలాబలాలను బట్టి ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఆధారపడి ఉంటుందన్నారు. కూటమి బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. జనసేనలో కష్టపడి పని చేసేవారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. సొంతంగా ఎవరికి వారు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

 

అదే జరిగితే వైసీపీకి ఎదురు దెబ్బ తప్పదని అంటున్నారు. ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి జనసేన తరపున మంత్రి నాదెండ్ల చెప్పడం ఇదే తొలిసారి. మొత్తానికి మంత్రి నాదెండ్ల మాటలతో వైసీపీలో ఎక్కడో గుబులు మొదలైనట్టు కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |