UPDATES  

NEWS

 హిందూ విద్యార్థికి ఖురాన్‌ హోంవర్క్ కలకలం.. స్కూల్ వద్ద భారీ ఉద్రికత్త..!

హైదరాబాద్‌‌లోని ఓ సంఘటన సంచలనంగా మారింది. ఓల్డ్‌సిటీ స్కూల్‌లో హోంవర్క్‌ వివాదం కలకలం రేపింది. ఈ వివాదం తీవ్రతరం కావడంతో స్కూలు యామాన్యం టీచర్‌ని సస్పెండ్ చేసారు. దీంతో బీజేపీ నేతలు స్కూల్ వద్దకు చేరుకుని భారీగా నిరసన తెలిపారు. దీంతో ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.

 

వివరాల్లోకి వెలితే..

హైదరాబాద్‌లోని సైదాబాద్ పరిధిలో గల సక్సెస్ ది స్కూల్ అనే పాఠశాలలో చదువుతున్న ఒక హిందూ విద్యార్థికి ఇస్లామిక్ ప్రార్థనలు అయిన కల్మా, సూరహ్ ఫాతిహా అనేవి చదవాలంటూ టీచర్ హోంవర్క ఇచ్చారు. దీంతో ఈ సంఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఇంటికి వెల్లిన తరువాత విధ్యార్ధి జరిగిన విషయాన్ని తన తల్లితండ్రులకు తెలిపింది. దీంతో ఈ ఘటన పై విద్యార్థి తల్లిదండ్రులు, హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులకు తెలిపారు. దీంతో ఆగ్రహనికి గురైన బీజీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్కూలు వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

 

స్కూలును రద్దు చేయాలని డిమాండ్..

పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు అక్కడి చేరుకుని స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలు స్కూల్ గేటు ముందు బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిన్న పిల్లలపై మతపరమైన అంశాలను ఎలా చెబుతారంటూ ఇందుకు గాను స్కూలు యాజమాన్యం భోర్డును రద్దు చేయాలని బీజేపీ నాయకుల డిమాండ్ చేశారు. ఉద్రిక్తత పరిస్ధితులు మరింత పెరగడంతో స్కూలు వద్దకు పోలీసులు చేరుకుని బీజేపీ నాయకులకు సద్దిచెప్పే ప్రయత్నం చేశారు. కొంత మంది నేతలను పోలీసుస్టేషన్‌కి తరలించి టీచర్ పై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులకు తెలిపారు.

ప్రత్యేక తనిఖీలు..

ఫైర్ బ్రాండ్ MLA రాజా సింగ్ సైతం స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హిందూ సంఘాల ఆగ్రహానికి ‘సక్సెస్ స్కూల్’ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. పొరపాటు జరిగిందని సమాధానం చెప్పింది. సదరు టీచర్‌ను సస్పెండ్ చేశామంది స్కూల్ యాజమాన్యం. మరోవైపు పోలీసులు, విద్యాశాఖ అధికారులు స్కూల్‌లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |