UPDATES  

NEWS

 ఏపీ పాలనలో వినూత్న ప్రయోగం..!

ఆంధ్రప్రదేశ్ పాలనలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నామని, డేటా ఆధారిత పాలన (డేటా డ్రివెన్ గవర్నెన్స్) దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా నెలవారీ ఆర్థిక నివేదికల (మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్స్) ఆధారంగా ప్రభుత్వ పాలనను ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఆయన ప్రకటించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక విషయాలను వెల్లడించారు.

 

ఈ సరికొత్త విధానం ద్వారా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ (కేపీఐ) బేస్డ్ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేస్తామని పయ్యావుల వివరించారు. దీనివల్ల రాష్ట్రంలోని వివిధ రంగాల్లో నమోదయ్యే వృద్ధి రేటును, ప్రగతిని ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో గమనించేందుకు వీలుంటుందని చెప్పారు. ఈ విధానం వల్ల ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే గుర్తించి, మనల్ని మనం సరిదిద్దుకుని ముందుకు సాగేందుకు ఆస్కారం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్‌ను సాకారం చేసుకునేందుకు ఈ నెలవారీ ఆర్థిక నివేదికలు ఎంతగానో ఉపకరిస్తాయని మంత్రి పయ్యావుల కేశవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |