UPDATES  

NEWS

 ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రెండోదశ జాబ్ క్యాలెండర్‌ పై సమీక్ష..!

ఆంధ్రప్రదేశ్ రాఫ్ట్ర నిరుద్యోగుల కలకలు త్వరలోనే నెరవేరనున్నాయి. నేడు ప్రభుత్వం రెండవ దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ కేలండర్ తయారి ప్రక్రియ పై ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులతో కలిసి సిఎస్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రెండవ దశ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జాబ్ కేలండర్ తయారి విధి విధానాలపై చర్చించనున్నారు.

 

రెండవ దశ జాబ్ క్యాలండర్‌..

ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధ్యక్షతన కార్యదర్శులు, శాఖాధిపతులతో సీఎస్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రధానంగా రెండవ దశ జాబ్ క్యాలండర్‌కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, కంప్లీషన్ ఆఫ్ ఇ-హెచ్ఆర్ఎం, లోకల్ కేడర్ ఆర్గనైజేషన్‌కు అనుగుణంగా నోటిఫికేషన్ పై కీలకంగా చర్చించనున్నారు. దీంతో పాటుగా నూతన లోకల్ కేడర్లరో పోస్టుల కేటాయింపు నోటిఫికేషన్, అన్ని కేడర్లలో ప్రాధాన్యత కేటగిరీలకు సంబంధించి సీనియారిటీ జాబితా పై అధికారులు కసరత్తు చేయనున్నారు.

వివిధ అధికారులకు..

నిరుద్యోగుల ప్రిపరేషన్, ఎలాంట్మెంట్ ఆఫ్ పెర్సన్స్, ఓపెనింగ్ ఆఫ్ రోస్టర్స్, ఎపిపిఎస్సి ఇతర రిక్రూటింగ్ ఏజెన్సీలకు ఇండెంట్స్ పంపడం తదితర అంశాలపై ప్రభత్వం అధ్యక్షతన సమీక్షించనున్నారు. ఈసమావేశంలో స్పెషల్ సిఎస్ లు ఎస్. ఎస్.రావత్, బి.రాజ శేఖర్, కృష్ణ బాబు, జి.జయలక్మి, మరియు ముఖ్య కార్యదర్శులు, వివిధ శాఖాధిపతులు ప్రభుత్వ అధికారులు పాల్టోననున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |