UPDATES  

NEWS

 అత్యవసర భేటీలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!

రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా లక్ష్యాలను సాధించడానికి ఆదాయ సమీకరణపై కచ్చితంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లీకేజీలను అరికట్టి ఆదాయ సమీకరణకు సంబంధించి చేజింగ్ సెల్‌ను ఏర్పాటు చేసి వాటిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్ తెలపారు. నేడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పలు కీలక అంశాలపై సమీక్ష సమావేశం ఎర్నాటు చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, కె రామకృష్ణారావు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

ఆదాయం పెంపుపై..

సందర్భంగా రాష్ట్ర ఆదాయ పెంపు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలిచ్చారు. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం తెలిపారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్‌తో పాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ఆదాయ సమీకరణలో చేజింగ్ సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాల్సిందేనని అధికారులకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

 

పెండింగ్ ప్రాజెక్టులు..

అనుకున్న స్థాయిలో పనిచేయాలంటే శాఖలవారీగా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని, పెండింగ్ ప్రాజెక్టులను, ఇతర పనులను పూర్తి చేసేందుకు అనుగుణంగా శాఖలవారిగా బడ్జెట్‌ను తయారు చేసుకోవాలని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా భూసేకరణకు మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ ఊహాజనితం కాదన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని, వాస్తవికత ఆధారంగానే బడ్జెట్ రూపకల్పన జరగాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయా శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎప్పడూ సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్ట్రం చేశారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |