UPDATES  

NEWS

 బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి..?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఒకప్పటి తన రాజకీయ గురువైన మమతా బెనర్జీ స్థానంలో బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది.

 

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎల్లుండి (శుక్రవారం) కోల్‌కతాలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సువేందు అధికారిని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఆయన పేరును ప్రతిపాదించనుండగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

 

ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున సువేందు అధికారి బలమైన అభ్యర్థిగా నిలిచారు. ఒకప్పుడు మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి కారణమైన నందిగ్రామ్‌లో ఆమెపై గెలిచి సంచలనం సృష్టించారు. తాజాగా ఆమె కంచుకోటగా భావించే భవానీపూర్‌లోనూ భారీ మెజారిటీతో విజయం సాధించి, పార్టీలో తిరుగులేని నేత‌గా ఆవిర్భవించారు. ఈ విజయాలే ఆయనను ముఖ్యమంత్రి పీఠం వైపు నడిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |