UPDATES  

NEWS

 ఢిల్లీ హైకోర్టులో వర్చువల్ కేసు విచారణలో.. ప్లే అయిన అశ్లీల వీడియోలు..

ఢిల్లీ హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఓ కేసు వర్చువల్ విచారణ జరుగుతుండగా ఒక్కసారిగా అశ్లీల వీడియోలు ప్లే అయ్యాయి. దీనితో వర్చువల్ విచారణను రెండుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, గుర్తు తెలియని వ్యక్తి ఈ విచారణలోకి వచ్చి వీటిని ప్లే చేసినట్లు వెల్లడైంది.

 

ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కోర్టులో బెంచ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఓ కేసును విచారిస్తుండగా, మధ్యలో అశ్లీల వీడియోలు కనిపించాయి. ఆందోళనకు గురైన అధికారులు విచారణను వెంటనే నిలిపివేశారు. తిరిగి విచారణ చేపట్టినప్పటికీ మరో రెండుసార్లు అలాగే అశ్లీల వీడియోలు కనిపించాయి. ఆ తర్వాత “మీరు హ్యాక్ అయ్యారు” అనే సందేశం కనిపించింది. దీంతో వర్చువల్ విచారణను పూర్తిగా నిలిపివేశారు.

 

ఢిల్లీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ ఇంటర్‌ఫేస్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి వర్చువల్ విచారణలోకి లాగ్-ఇన్ అయి వీడియోలను ప్లే చేసినట్లు గుర్తించారు. శ్రీధర్ సర్నోబత్, షిత్‌జీత్ సింగ్ అనే పేర్లతో లాగ్-ఇన్‌లో ఉన్న రెండు ఖాతాల నుంచి అశ్లీల కంటెంట్‌ ప్లే అయినట్లు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |